
విజయవాడ (ప్రజావాణి జూన్ 20) ఏపీ హంసా ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ సిటీ విభాగం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వినుకొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ముఖ్యంగా కో-ఆప్షన్ (Co-option) పద్ధతి ద్వారా ఎంపికైన నూతన సభ్యులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం వారిచే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఎన్నికల పర్యవేక్షణ ఈ పూర్తి ఎన్నిక మరియు ప్రమాణ స్వీకార ప్రక్రియను ఏపీ హంసా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దేవానంద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి పర్యవేక్షించారు. అలాగే ఏపీ హంసా రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి పాగోలు రమా ఎన్నికల అబ్సర్వర్గా వ్యవహరించి ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విశేష కార్యక్రమంలో విజయవాడ సిటీ అధ్యక్షులు శ్రీమతి జలం సరోజిని గారు, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సభ్యులకు అభినందనలు తెలియజేశారు.




