పోలవరం జూన్ 22 ప్రజావాణి నియోజకవర్గంలోని కేఆర్‌పురం ఐటిడిఏ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు,ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.ముందుగా కేఆర్‌పురం ఐటిడిఏకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు,ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఒక్కో శాఖ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానవనం, గిరిజన సంక్షేమం, విద్యుత్, రహదారులు మరియు భవనాల శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ తదితర శాఖల అధికారులు తమ శాఖల పనుల పురోగతిని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులను మంత్రి, ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రభుత్వ పథకాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని ఆదేశించారు.పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం,అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన,తాగునీటి సమస్యల పరిష్కారం,రహదారుల అభివృద్ధి,విద్యా మరియు వైద్య సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను గుర్తించి సంబంధిత అధికారుల ద్వారా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.అలాగే గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తి కావాలని,ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరే విధంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.శాఖల మధ్య సమన్వయం పెంచుకుని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.సమావేశంలో అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమస్యలు,అవసరాలు,భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను మంత్రి మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన మంత్రి,ఎమ్మెల్యే సంబంధిత అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో, ఆర్డీవో రమణ, ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, వివిధ శాఖల జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Homeఆంధ్రప్రదేశ్కేఆర్‌పురం ఐటిడిఏలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో...
కేఆర్‌పురం ఐటిడిఏలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
0
5
RELATED ARTICLES
- Advertisment -




