గ్రామ శివారులో భారీగా నిల్వ చేసిన నల్ల బొగ్గు.!!పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందని ఆందోళన.!!!అనుమతులతోనే వ్యాపారం జరుగుతుంది..!!!స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ తోనే చేస్తున్నాను ఫోన్లో బెదిరింపులు..
ముప్పాళ్ల, జూన్ 22 ప్రజావాణి చందర్లపాడు మండలంలోని ఓ గ్రామ శివారులో భారీ మొత్తంలో నల్ల బొగ్గు నిల్వలు కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.గ్రామానికి సమీపంలో పెద్ద పెద్ద కుప్పలుగా బొగ్గును నిల్వ చేయడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలంలో బొగ్గు నిల్వల నుంచి వెలువడే ధూళి,కలుషిత నీరు పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.ముఖ్యంగా వ్యవసాయ భూములు,భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ బొగ్గు నిల్వలు,వ్యాపారం నిర్వహించేందుకు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నారా? పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భారీ వాహనాల రాకపోకల వల్ల గ్రామ రహదారులు దెబ్బతింటున్నాయని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు.గ్రామ శివారులో ఇంత పెద్ద ఎత్తున నల్ల బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. వెంటనే రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి,
గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు.గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భద్రతకు భంగం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి” అని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.దీనిపై ముప్పాళ్ళ గ్రామంలో కొంతమంది విలేకరులు వెళ్లి ఫోటోలు తీస్తున్న సమయంలో బొగ్గు వ్యాపారం దగ్గర ఉన్న వ్యక్తి ఫోటోలు తీసినంత మాత్రాన ఈ వ్యాపారం ఆగదు కావాలంటే నీకు ఫోన్ నెంబర్ ఇస్తా ఆయనకు ఫోన్ చేసి ఒకసారి చూడు.గుంటూరులో ఉంటాడు అని నెంబర్ ఇచ్చాడు.అంత స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదగానే చేస్తున్నాను.ఏదైనా ఉంటే స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి.అని పదునైన సమాధానం చెప్పాడు. ఆ వీడియోలో ఏం మాట్లాడాడో మీరు వినవచ్చు.ఇలాంటి వాళ్ళకు బొగ్గు వ్యాపారం అవసరమా ఇక్కడ ఎక్కడో గుంటూరు అతను వచ్చి ముప్పాళ్ళ వ్యాపారం చేస్తూ స్థానికులకు ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నాడు.కాబట్టి స్థానిక ఎమ్మెల్యే వెంటనే ఈ బొగ్గు వ్యాపారం పై చర్యలు తీసుకొని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. స్థానిక ఎమ్మెల్యే గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భద్రతకు భంగం కలగకుండా అధికారులు ఆదేశాలిచ్చి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు




