📄 ePaper
Tuesday, June 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎన్నికల హామీ నెరవేర్చిన వార్డు మెంబర్ సంబు తిరుపతి-మల్లం చెరువు, వడ్డెర కాలనీ ప్రజలకు సౌండ్...

ఎన్నికల హామీ నెరవేర్చిన వార్డు మెంబర్ సంబు తిరుపతి-మల్లం చెరువు, వడ్డెర కాలనీ ప్రజలకు సౌండ్ బాక్సుల పంపిణీ

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూన్ 18(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడు సంబు తిరుపతి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గెలుపొందిన అనంతరం మాట తప్పకుండా మల్లం చెరువు మరియు వడ్డెర కాలనీ ప్రజల కోసం సుమారు రూ.1.30 లక్షల వ్యయంతో సౌండ్ బాక్సులను కొనుగోలు చేసి పంపిణీ చేశారు.
రేగులపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు జీల లింగం, ఉపసర్పంచ్ గైని త్రిశూల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ వార్డు ప్రజలకు సౌండ్ బాక్సులు అందజేశారు.ఈ సందర్భంగా స్థానికులు సంబు తిరుపతి ఎన్నికల హామీని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువ నాయకులు  10వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular