- జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జూన్17 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో నిర్వహించిన ఉపసర్పంచుల ఫోరం సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల నూతన కమిటీ వివరాలను ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, రాజారాంపల్లి ఉప సర్పంచ్ మేరుగు జంపన్న (జానీ) అధికారికంగా వెల్లడించారు. ఎండపల్లి మండల నూతన అధ్యక్షుడుగా కొత్తపేట గ్రామ ఉపసర్పంచ్ సింహరాజు క్రాంతి ని, ఉపాధ్యక్షుడి గా మారేడుపల్లి గ్రామ ఉపసర్పంచ్ చీమల శ్రీనివాస్ లతో పాటుగా, వర్కింగ్ ప్రెసిడెంట్ అలుగం తిరుపతి, చెర్లపల్లి. ప్రధాన కార్యదర్శి తనుగుల విజయ్ కొండాపూర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మేరుగు జంపన్న మాట్లాడుతూ…. ఉపసర్పంచుల హక్కుల సాధన కోసం, గ్రామాల అభివృద్ధి కోసం నూతన కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ముత్యాల స్వామి, జిల్లా కన్వీనర్ గురిజాల బుచ్చిరెడ్డితో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ఉపసర్పంచులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.




