📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamప్రభుత్వ జీతాలు ప్రైవేటు వైద్యమే ముద్దు

ప్రభుత్వ జీతాలు ప్రైవేటు వైద్యమే ముద్దు

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ జీతాలు ప్రైవేటు వైద్యమే ముద్దు

విధులకు ఎగనామం నిండుగా జీతాలు…?

తిరుమలాయపాలెం సిహెచ్ సీలో ప్రభుత్వ వైద్యుల ఇ ష్టారాజ్యం

ఇట్లయితే పేదలకు వైద్యం అందేదెట్లా..?


మన ప్రజావాణి డెస్క్ ప్రతినిధి



కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం వైద్య కోసం కోట్లాది రూపాయలు బడ్జెట్ను ప్రవేశపెట్టి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని సంకల్పంతో ప్రణాళికలు తయారుచేసి అమలుపరుస్తూ ఉంటారు. కానీ నిలువెత్తు నిర్లక్ష్యం రాజకీయ అండదండలు జిల్లా స్థాయి అధికారుల వద్ద పలుకుబడి తో విధులకు ఎగనామం పెడుతూ ప్రైవేటు కార్పొరేట్ హాస్పటల్లో (సొంత) వైద్య సేవలు చేస్తూ విధులకు ఎగనామం పెట్టి ప్రభుత్వ జీతాలు పొందుతూ ప్రభుత్వ నిధులు కాజేస్తున్న సంబంధిత జిల్లాస్థాయి అధికారులు నోరు మెదపడం పోవడం విశేషం. మన ప్రజావాణి ప్రతినిధి సేకరించిన సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ దవాఖాన లో పేదలకు వైద్య సేవలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన వైద్యులు తోపాటు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వైద్యులు 9 మంది నిత్యం విధులు నిర్వహించాల్సి ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో వైద్య సేవలు అందరిని ద్రాక్షలా మారిందని నియోజకవర్గ ప్రజలు మండల ప్రజలు అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ నలుగురు డాక్టర్లు సొంత వైద్యశాలను ఏర్పాటు చేసుకొని నిత్యం సొంత హాస్పిటల్ లో వైద్య సేవలు అందిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు ఓపి సేవలు అందుబాటులోకి రావాల్సి ఉండగా సంబంధిత వైద్యులు విధులకు డుమ్మా కొడుతూ లేదా సమయం మించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత హాస్పిటల్కు వచ్చి సంతకాలు చేసి వెళుతున్నట్లు పలువురు ప్రజా సంఘాల నేతలు రోగులు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఓ స్థాయి కలిగిన డాక్టర్లు కూడా ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నట్లు ఒక్కొక్కసారి ఖమ్మంలోనే ఉండి ప్రైవేటు సేవలు అందిస్తున్నట్లు ఆరోపణలు విమర్శలు గు ప్పుమంటున్నాయి. కొందరు వైద్యులు దీర్ఘకాలికంగా సెలవులు పెట్టి ప్రైవేటు వైద్యాన్ని అందిస్తూ కాలం గడుపుతున్నట్లు తెలిసింది..


మరికొన్ని సమగ్ర వివరాలతో ఆధారాలతోరేపటి కథనం…2లో

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.