📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సరికాదు..

ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సరికాదు..

📰 Generate e-Paper Clip

ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సరికాదు..మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కంచర్ల స్వామి

సిద్దిపేట, జగదేవపూర్, జూన్ 13, ప్రజావాణి

జగదేవపూర్: గ్రామపంచాయతీలో ఉపసర్పంచులకు ఉన్న చెక్ పవర్ ను రద్దు చేయవద్దని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కంచర్ల స్వామి ప్రభుత్వాన్ని కోరారు. జగదేవపూర్ మండల కేంద్రంలోవిలేకరులసమావేశంనిర్వహించారు,సమావేశానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట జిల్లా కో కన్వీనర్ డి. ప్రవీణ్ గౌడ్ హాజరయ్యారు,ఈ సమావేశంలో మండలం ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కంచర్ల స్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సుమారు 12,769 మంది ఉప సర్పంచ్లు గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఉప సర్పంచ్ల హక్కులను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి చెక్ పవర్ను తొలగించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉప సర్పంచ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులే అధికంగా ఉన్నారని, బడుగు బలహీన వర్గాల హక్కులను ప్రభుత్వం కాపాడాలని కోరారు.ఈ నెల 25 న హైద్రాబాద్ లో జరగబోయే ఉపసర్పంచ్ ల చెక్ పవర్ రద్దు ధర్నా చేయడం జరుగుతుందన్నారు, ఈ ధర్నాను జగదేవపూర్ మండల వ్యాప్తంగా ఉన్న ఉపసర్పంచ్లందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉప సర్పంచ్ లు ,బాబు , రాజకుమార్ , రామచంద్రం , రాజు.కర్ణాకర్ మల్లికార్జున రెడ్డీ కొడవెల్లి స్వామి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.