ప్రజావాణి మోతే జూన్ 10: మామిళ్ళగూడెం గ్రామం లోని పల్లే దవాఖాన ప్రాంగాణంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక లో భాగంగా మండల ఎస్ ఐ అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది తొ కలిసి మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమం లో వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు పచ్చదనాన్ని పెంపొందించ డానికి మొక్కలు నాటడం ఎంతో అవసరం అని,కాలుష్యాన్ని తరిమికొట్టాలంటే ప్రతి ఇంట్లో మొక్కలు నాటలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో గ్రామసర్పంచ్ నాగమణి వీరస్వామి, కార్యదర్శి కవిత, ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి,వార్డు మెంబెర్స్, ఆశవర్కర్ సుభద్ర,గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు నాటండి….. భవిష్యత్ తరాలకు భరోసానివ్వండి…… మొక్కలు లేకపోతే -మన మనుగడయే సున్నా….
0
12


