📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పాలనా వికేంద్రీకరణ కాగితాలకే పరిమితం: కడప నగరానికి మరో తహసీల్దార్ కార్యాలయం ఏది*

పాలనా వికేంద్రీకరణ కాగితాలకే పరిమితం: కడప నగరానికి మరో తహసీల్దార్ కార్యాలయం ఏది*

📰 Generate e-Paper Clip

కడప జూన్ 10 ప్రజావాణి నగర ప్రజల దశాబ్దాల కల,అదనపు తహసీల్దార్ కార్యాలయం (అర్బన్ మండలం) ఏర్పాటు ప్రతిపాదన కేవలం ఫైళ్లకే పరిమితమైంది.రోజురోజుకూ విస్తరిస్తున్న నగరం,పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యం ఇక్కడ అభాసుపాలవుతోంది.2007లోనే దీనికి సంబంధించిన దస్త్రాలు కదిలినా,నేటికీ ఆచరణకు నోచుకోకపోవడం అధికారుల,పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.నిబంధనలు ఒకటి.క్షేత్రస్థాయి పరిస్థితి మరొకటిసాధారణంగా 30 వేల నుండి 50 వేల జనాభాకు ఒక తహసీల్దార్ కార్యాలయం ఉండాలనేది నిబంధన.కానీ కడప నగర జనాభా లక్షల్లోకి చేరినా,నేటికీ ఒకే ఒక్క కార్యాలయంపై భారం పడుతోంది. సేవలను మెరుగుపరచడం కోసం కడప మండలాన్ని’అర్బన్”రూరల్’మండలాలుగా విభజించాలని ఎప్పుడో ప్రతిపాదించారు.దానికి సంబంధించిన డిజిటల్ టోకెన్ల జారీ,విభజన ప్రక్రియలు నేటికీ మూలనపడ్డాయి.ఏళ్ల తరబడి మారుతున్న కలెక్టర్లు,ఆర్డీఓలు,తహసీల్దార్లు ఈ ఫైలును పట్టించుకోకపోవడంతో పరిస్థితి “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్లుగా మారింది.అరవింద్ నగర్ స్థానికుల తిప్పలు కిలోమీటర్ల ప్రయాణం.రోజుల తరబడి నిరీక్షణనగరంలో వేగంగా విస్తరిస్తున్న అరవింద్ నగర్ వంటి కీలక ప్రాంతాల ప్రజలకు ఈ కార్యాలయ దూరం పెద్ద శాపంగా మారింది.స్థానికంగా డ్రైనేజీ సమస్యలు,రోడ్ల ఆక్రమణలు,ఇతర మౌలిక వసతులపై రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇవ్వాలన్నా కిలోమీటర్ల దూరం ప్రయాణించి మెయిన్ ఆఫీస్‌కు వెళ్లాల్సి వస్తోంది.అక్కడికి వెళ్తే అధికారులు ప్రోటోకాల్ విధుల్లోనో,మీటింగ్‌లలోనో ఉండటంతో సామాన్యుల సమస్యలు గాలికొదిలేసినట్లవుతోంది.చిన్న భూవివాదం లేదా సరిహద్దు సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి ఫైళ్లు కదలడం లేదని అరవింద్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పోస్టులు ఉన్నాయి.ఆఫీస్ లేదు!విచిత్రమేమిటంటే,అర్బన్ తహసీల్దార్,డిప్యూటీ తహసీల్దార్,ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.వారిని నియమించింది కూడా.కానీ వీరంతా ఆర్డీఓ (RDO) కార్యాలయానికే పరిమితమై అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి,సిబ్బందిని అక్కడే కూర్చోబెట్టాలనే స్పష్టమైన లేకపోవడంతో ఈ పోస్టులు ఉన్నా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.అమాంతం పెరిగిన పనిభారం.అల్లాడుతున్న అర్జీదారులుకుల,ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాల కోసం నిత్యం 200 నుండి 500 వరకు దరఖాస్తులు వస్తున్నాయి.ఇవి కాకుండా వివిధ పనుల నిమిత్తం మరో 200 మందికి పైగా ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.దీనికి తోడు ప్రముఖుల పర్యటనలు,ప్రోటోకాల్ బాధ్యతలను రెవెన్యూ అధికారులే చూసుకోవాల్సి వస్తోంది.కార్యక్రమాల నిర్వహణ జాతీయ నాయకుల జయంతి,వర్ధంతి కార్యక్రమాల పర్యవేక్షణ భారం కూడా వీరిపైనే ఉంది.ఎన్నికల విధులు ఓటర్ల నమోదు,మార్పులు,చేర్పుల ప్రక్రియ నిరంతరం అదనపు భారంగా మారుతోంది.ఈ పనుల వల్ల తహసీల్దార్,వీఆర్వోలు క్షేత్రస్థాయిలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది.ఫలితంగా కార్యాలయానికి వచ్చే సామాన్య అర్జీదారులకు సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.ప్రజా ప్రతినిధులు,స్థానికుల డిమాండ్లు:ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయాలి “కడప నగర విస్తరణకు తగ్గట్టుగా కొత్త అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయడం అత్యంత అవసరం. సిబ్బందిని కేటాయించి ఆర్డీఓ ఆఫీస్‌లో కూర్చోబెడితే సామాన్యుడికి ఏం లాభం?ప్రత్యేక భవనాన్ని కేటాయించి,పూర్తిస్థాయి అధికారాలతో నూతన కార్యాలయాన్ని ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.”చిన్న సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరగాలా?(అరవింద్ నగర్ స్థానిక నివాసి):”పిల్లల చదువుల కోసం కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా,రేషన్ కార్డులో మార్పులు చేయాలన్నా ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయంలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.అధికారులు అందుబాటులో ఉండటం లేదు.అరవింద్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్షణమే అదనపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.”ఉన్నతాధికారులు స్పందించేదాకా పోరాటం తప్పదుకడప నగర ప్రజల,ముఖ్యంగా శివారు కాలనీల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. కేవలం కాగితాలపై ఉన్న అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ప్రతిపాదనకు ప్రాణం పోయాలి. సిబ్బందిని పూర్తిస్థాయిలో కేటాయించి,నగరంలో ప్రత్యేక కార్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాలి. లేనిపక్షంలో ప్రజా ఆగ్రహం తప్పదని,పాలనా వికేంద్రీకరణ అనేది కేవలం ప్రచారానికేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.*ఈ కార్యాలయం మీద మరో కథనంతో రేపటి సంచికలో మీ ప్రజావాణి*

Previous article
మొక్కలు నాటండి….. భవిష్యత్ తరాలకు భరోసానివ్వండి…… మొక్కలు లేకపోతే -మన మనుగడయే సున్నా…. ప్రజావాణి మోతే జూన్ 10: మామిళ్ళగూడెం గ్రామం లోని పల్లే దవాఖాన ప్రాంగాణంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక లో భాగంగా మండల ఎస్ ఐ అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది తొ కలిసి మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమం లో వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు పచ్చదనాన్ని పెంపొందించ డానికి మొక్కలు నాటడం ఎంతో అవసరం అని,కాలుష్యాన్ని తరిమికొట్టాలంటే ప్రతి ఇంట్లో మొక్కలు నాటలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో గ్రామసర్పంచ్ నాగమణి వీరస్వామి, కార్యదర్శి కవిత, ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి,వార్డు మెంబెర్స్, ఆశవర్కర్ సుభద్ర,గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular