📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబెజ్జంకి PACS ఏసీ ఫంక్షన్ హాల్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

బెజ్జంకి PACS ఏసీ ఫంక్షన్ హాల్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,జూన్ 11(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS), బెజ్జంకి ఆధ్వర్యంలో ఇటీవల ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఏసీ ఫంక్షన్ హాల్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు PACS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మంచాల శ్రీనివాస్ తెలిపారు.
ఆయన విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఫంక్షన్ హాల్ నిర్వహణ కాలపరిమితి రెండు సంవత్సరాలుగా నిర్ణయించగా, సంవత్సరానికి నిర్వహణ రుసుము రూ.10 లక్షలుగా ఖరారు చేశారు.ఈ యొక్క టెండర్ ప్రక్రియలో పాల్గొనదలచిన వారు జూన్ 17, 2026 లోపు పీఏ సి ఎస్ కార్యాలయం, బెజ్జంకిలో రూ.50 వేల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) చెల్లించి రసీదు పొందాల్సి ఉంటుంది. డిపాజిట్ చెల్లించిన వారికి మాత్రమే టెండర్‌లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలతో ఫంక్షన్ హాల్ సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మంచాల శ్రీనివాస్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.