📄 ePaper
Wednesday, June 10, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamపందిళ్ళపల్లి మత్స్య సొసైటీలో కీలక పరిణామం

పందిళ్ళపల్లి మత్స్య సొసైటీలో కీలక పరిణామం

📰 Generate e-Paper Clip

పందిళ్ళపల్లి మత్స్య సొసైటీలో కీలక పరిణామం…!

పందిళ్ళపల్లి బొప్పారం గ్రామాల మత్స్యకారుల సర్వసభ్య సమావేశం

సంఘం పరిధిలో కుంటలపై పట్టు వీడని మత్స్యకారులు

కొనసాగుతున్న ప్రతిస్తంభన.. పట్టించుకోని జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు…?


ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి


ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గత ఆరు నెలలుగా మత్స్యకారులు మెజార్టీ ప్రకారం వ్యవహరిస్తూ ఈ ఏడాది నుండి కాంట్రాక్టర్కు చేపల చెరువు లీజుకి ఇచ్చేది లేదంటూ మరియు పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ పరిధిలో ఉన్న పెద్ద చెరువుతోపాటు ఊరకుంట మరో రెండు కుంట లు ప్రభుత్వ రికార్డులు ఆదేశాల ప్రకారం విలీనం అయిన నేపథ్యంలో పందిళ్ళపల్లి బొప్పారం గ్రామాలకు చెందిన మత్స్యకారులు హక్కుల కోసం జిల్లా స్థాయి అధికారులను పలుమార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించారని తెలిసింది. సొసైటీలోని కొందరు ఊరకుంట తో పాటు కొన్ని కుంటలను తమ కబంధహస్తాలలో బందీగా చేసి కొన్ని సంవత్సరాలుగా మత్స్యకారులకు ప్రధానంగా పందిళ్ళపల్లి బొప్పారం గ్రామాలకు చెందిన మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని గత సంవత్సరం నుండి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నప్పటికీ నేటికీ జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విశేషం. దీంతో మంగళవారం మరో మారు పందిళ్ళపల్లి బొప్పారం మత్స్యకారులు పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు ఆమోదించినట్లు తెలిసింది. ఇప్పటికైనా జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు ప్రభుత్వం స్పందించి పందిళ్ళపల్లి బొప్పారం మత్స్యకారులకు న్యాయం చేయాలని పలువురు జిల్లా మత్స్యకారులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular