📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriలక్ష్మీనారాయణ కాలనీ నీ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఈఆర్ లక్ష్మీనారాయణ

లక్ష్మీనారాయణ కాలనీ నీ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఈఆర్ లక్ష్మీనారాయణ

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూన్ 8: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని పోచారం మున్సిపాలిటీ 8వ వార్డు చౌదరిగూడ లోని లక్ష్మీనారాయణ కాలనీలో గ్రీన్ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఈఆర్ లక్ష్మీనారాయణ, కాలనీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 15 రోజుల వ్యవధిలోనే కాలనీ భద్రత కోసం సుమారు రూ.1 లక్ష వ్యయంతో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే కాలనీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ నీటి సరఫరా కల్పించాలని కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేసినట్లు చెప్పారు. అదేవిధంగా త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల కాలనీవాసుల ఇండ్లలో ఫ్రిడ్జ్‌లు, టీవీలు తదితర విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని, ఈ సమస్య పరిష్కారం కోసం ఏఈ, డీఈ అధికారులకు వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కాలనీవాసుల సహకారం, మద్దతుతో చౌదరిగూడలోని లక్ష్మీనారాయణ కాలనీ నీ ఆదర్శవంతమైన నంబర్ వన్ కాలనీ గా తీర్చిదిద్దుతానని ఈఆర్ లక్ష్మీనారాయణ అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డి. వెంకటేష్ గౌడ్, జనరల్ సెక్రటరీ దావీద్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డి. వీరస్వామి, ట్రెజరర్ జి. బాల మహేందర్, అడ్వైజర్ డి. రాజలింగం, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు అధ్యక్షుడు ఈఆర్ లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular