లక్ష్మీనారాయణ కాలనీ నీ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఈఆర్ లక్ష్మీనారాయణ
ఘట్కేసర్, జూన్ 8: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని పోచారం మున్సిపాలిటీ 8వ వార్డు చౌదరిగూడ లోని లక్ష్మీనారాయణ కాలనీలో గ్రీన్ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఈఆర్ లక్ష్మీనారాయణ, కాలనీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 15 రోజుల వ్యవధిలోనే కాలనీ భద్రత కోసం సుమారు రూ.1 లక్ష వ్యయంతో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే కాలనీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపడుతున్నామని...