📄 ePaper
Sunday, June 7, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఓట్లు అడిగేటప్పుడు గుర్తొచ్చే మూలవీధి... సమస్యలు వస్తే ఎందుకు కనిపించదు?"

ఓట్లు అడిగేటప్పుడు గుర్తొచ్చే మూలవీధి… సమస్యలు వస్తే ఎందుకు కనిపించదు?”

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (జూన్ 06) ప్రజావాణి పోరుమామిళ్ల పట్టణంలోని 7వ వార్డు మూలవీధి ప్రజలు గత 15 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా వీధంతా చెరువును తలపించేలా మారిపోతుందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొందన్నారు.ఎన్నికల సమయంలో మాత్రం ఎమ్మెల్యేలకు ఓట్లు కావాలి, సర్పంచ్‌లకు ఓట్లు కావాలి, వార్డు సభ్యులకు ఓట్లు కావాలి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకునే నాయకుడు ఒక్కరు కూడా కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రజలు మురుగు నీటిలోనే జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.ఇప్పుడు చిన్న వర్షానికే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మూలవీధిలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి, ఎవరికీ ఓటు వేయాలి.. ఎవరికీ వేయకూడదో ఆలోచించే సమయం వచ్చిందని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular