📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణMahabubabadకోమటిపల్లి లో చదువుకున్న శ్రీధర్ గౌడ్ ఇకలేరు

కోమటిపల్లి లో చదువుకున్న శ్రీధర్ గౌడ్ ఇకలేరు

📰 Generate e-Paper Clip


ప్రజావాణి,ఇనుగుర్తి:బాల్యమంతా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి లో గడిపి విద్యాభ్యాసం చేసిన పంజాల శ్రీధర్ గౌడ్(32) ఇక లేరు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో మిత్రమా నీ జ్ఞాపకాలను మర్చిపోలేక పోతున్నామంటూ క్లాస్ మెంట్స్,బాల్య స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.నిజానికి శ్రీధర్ గౌడ్ నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన వాడు. కోమటిపల్లి లో తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం తన స్వగ్రానమానికి వెళ్లి తన గౌడ వృత్తిని చేపట్టి వివాహం చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు సంతానం. కోమటిపల్లి నుంచి వెళ్లిపోయినప్పటినుంచి  గ్రామంలోని స్నేహితులు గ్రామస్తుల పట్ల నిరంతరం ప్రేమానురాగాలు కురిపిస్తూ పలకరిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై హనుమకొండ లోని శ్రీ బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆసుపత్రి లోని వైద్యుల మిడిమిడి జ్ఞానం తో చికిత్స అందించడం మూలంగా గురువారం రాత్రి కన్నుమూశాడు. దీంతో మిత్రుని కోల్పోయామని పైండ్ల అనిల్ కుమార్ తో పాటు ఇటు బాల్యమిత్రులు, అందరితో మర్యాదగా తలలో నాలుక వలె ఉండే చురుకైన శ్రీధర్ గౌడ్ ను చిన్న వయసులోనే కోల్పోయామని ఆటో గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular