📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెట్టి చాకిరి విముక్తికి సమిష్టి కృషి అవసరం.రెవిన్యూ డివిజనల్ అధికారి జి వసంత బాబు.

వెట్టి చాకిరి విముక్తికి సమిష్టి కృషి అవసరం.రెవిన్యూ డివిజనల్ అధికారి జి వసంత బాబు.

📰 Generate e-Paper Clip

బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనపై బాండెడ్ లేబర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం.

కళ్యాణదుర్గం,(జూన్ 06) ప్రజావాణి బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఇందుకోసం చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కళ్యాణ దుర్గం ఆర్డీవో జీ వసంత బాబు పిలుపునిచ్చారు.శనివారం ఆర్డిఓ ఆఫీస్ కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976 పై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని అప్పుల పేరుతో వ్యక్తులను బలవంతంగా వెట్టిచాకిరి చేయించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రెవెన్యూ పోలీస్ మరియు కార్మిక శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు.సమాజంలో ఇటువంటి అమానవీయ పోకడలను రూపుమాపేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బాధితులు ఎటువంటి భయం లేకుండా పోలీసులను సంప్రదించవచ్చు వారి వివరాలను గోప్యంగా ఉంచి న్యాయం చేస్తామని ఆర్డిఓ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి రవిబాబు,ఇన్చార్జి డిఎల్డిఓ కొండన్న, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ మరియు డివిజన్లోని అందరూ తహసిల్దారులు ఎంపీడీవోలు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మోహన్ రామాంజనేయులు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular