వెట్టి చాకిరి విముక్తికి సమిష్టి కృషి అవసరం.రెవిన్యూ డివిజనల్ అధికారి జి వసంత బాబు.

బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనపై బాండెడ్ లేబర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం. కళ్యాణదుర్గం,(జూన్ 06) ప్రజావాణి బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఇందుకోసం చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కళ్యాణ దుర్గం ఆర్డీవో జీ వసంత బాబు పిలుపునిచ్చారు.శనివారం ఆర్డిఓ ఆఫీస్ కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976 పై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని అప్పుల పేరుతో వ్యక్తులను బలవంతంగా వెట్టిచాకిరి...