ప్రజల ఆరోగ్యంతో చెలగాటం..అధికారులు మౌనం..!!
బ్యాక్టీరియా తేలినా బంద్ చేయరా..??
నివేదికలు వచ్చాయి.చర్యలు ఎక్కడ..??
కలుషిత నీటిపై అధికారుల కరుణ ఎందుకు..??
నోటీసులకే పరిమితమైన చర్యలు..!!
ప్రాణాలకు ముప్పు..అధికారులకు పట్టదా..??
బ్యాక్టీరియా వాటర్‌పై ఆర్డీఓ ఎందుకు మౌనం..??
20 రోజులుగా ఫైళ్లకే పరిమితం..ఆర్డీఓ కార్యాలయంలోనే ఆగిపోయిన చర్యలు..!!
జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ప్రజల డిమాండ్..!!
ప్రజల ఆరోగ్యమా..?? ప్లాంట్ల యజమానుల ప్రయోజనాలా..??
బ్యాక్టీరియా నీటిపై చర్యలు తీసుకోవడానికి అడ్డెవరు..??
కలుషిత నీరు సరఫరా..అధికారుల ఉదాసీనత..!!
నంద్యాలలో మినరల్ వాటర్ మాఫియాపై చర్యలేవి..??
ప్రజల ప్రాణాల కంటే నిర్లక్ష్యమే
నంద్యాల జిల్లా.జూన్ 5 ప్రజావాణి నంద్యాల పట్టణంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన మినరల్ వాటర్ ప్లాంట్లు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.నంద్యాల పట్టణంలోని 20కు పైగా మినరల్ వాటర్ ప్లాంట్లలో నాణ్యత లోపాలు,బ్యాక్టీరియా ఆనవాళ్లు గుర్తించినట్లు అధికారుల తనిఖీల్లో తేలినప్పటికీ ఇప్పటివరకు కఠిన చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.కర్నూలు రీజినల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ పరీక్షల్లో కొన్ని ప్లాంట్లలో PH విలువలు నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా ఉండటంతో పాటు,KLEBSIELLA SPECIES బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.ఈ నివేదికల ఆధారంగా మున్సిపల్ కమిషనర్ సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి,తదుపరి చర్యల కోసం ఆర్డీఓ కార్యాలయానికి నివేదికలు పంపినట్లు తెలిసింది.అయితే నివేదికలు వెళ్లి మూడు వారాలకు పైగా గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ప్లాంట్‌పైనా కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారిక నివేదికలు వచ్చినా ప్లాంట్లు యథేచ్ఛగా కొనసాగుతుండటాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు.నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా,కలుషిత నీటిని సరఫరా చేస్తున్న ప్లాంట్లను తక్షణమే మూసివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.వేలాది కుటుంబాలు ప్రతిరోజూ వినియోగిస్తున్న తాగునీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలినా సంబంధిత శాఖలు స్పందించకపోవడం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అంశంలో ఆలస్యం చేయడం ఏమాత్రం సమంజసం కాదని అంటున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా జోక్యం చేసుకుని మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని,బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిన వాటర్ ప్లాంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.నివేదికలు వచ్చిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదో బాధ్యత కల్గిన అధికారులను ప్రశ్నించాలని కోరుతున్నారు.బ్యాక్టీరియా ఉన్న నీటిని తాగి,ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాత స్పందిస్తారా.లేక ఇప్పుడే కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారా.అన్న ప్రశ్న నంద్యాల ప్రజల నుంచి వినిపిస్తోంది.జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని పట్టణవాసులు కోరుతున్నారు.


