📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarఅగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ రజినీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక

అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ రజినీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ రజినీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక


* రెండోసారి అధ్యక్షుడిగా అంబాల రజనీకాంత్‌కు సభ్యుల పూర్తి మద్దతు

* ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యమని నూతన కమిటీ వెల్లడి

జమ్మికుంట ఆగస్టు 1 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగాఎన్నుకున్నారుయూనియన్ అధ్యక్షుడిగా అంబాల రజనీకాంత్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషంఆయన నాయకత్వంపై సభ్యులు మరోసారి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారునూతన కమిటీలో వైస్ ప్రెసిడెంట్‌గా దొడ్డి రాజు కోశాధికారిగా రాజేష్, ప్రచార కార్యదర్శిగా నన్నబోయిన రాజును ఎన్నుకున్నారు అలాగే యూనియన్ బలోపేతం కోసం కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారుఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ అగ్రికల్చర్ ప్రైవేట్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ వారి సంక్షేమం ఉద్యోగ భద్రత వేతనాలు సంక్షేమ పథకాల అమలు కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. సభ్యులంతా ఐక్యంగా పనిచేస్తూ యూనియన్‌ను మరింత బలోపేతంచేస్తామనిచెప్పారుయూనియన్ సభ్యులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సమావేశంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular