కడప జిల్లా.జూన్ 02 ప్రజావాణి బద్వేల్ మున్సిపాలిటీ పరిదిలోని కుమ్మరి కొటాలు అక్రముగా రేషన్ బియ్యం ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్న వైనం.రేషన్ మాఫియాకు చెందిన వ్యక్తి రేషన్ బియ్యం ను అడ్డుకున్న గ్రామస్తులు పై దాడికి సైతం వెనకాడని అక్రమ రేషన్ దారులు.పట్టపగలే పేదలకు చెందవలసిన రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న నిమ్మకు నీరు ఎత్తని విధంగా అదికార యంత్రాంగం.ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చడానికి రూపాయి ఖర్చు లేకుండా అందిస్తున్న రేషన్ బియ్యం, కొందరు అక్రమార్కుల పాలిట కామధేనువులా మారుతోంది. అర్హులైన పేదలకు చేరాల్సిన ఈ బియ్యం, అధికారుల కనుసన్నల్లోనే యథేచ్ఛగా సరిహద్దులు దాటుతోంది. నిరుపేదల కడుపు కొట్టి, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, కోట్ల రూపాయల నల్లధనాన్ని ఆర్జిస్తున్న రేషన్ మాఫియా నెట్‌వర్క్ రోజురోజుకూ విస్తరిస్తోంది.యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణా గ్రామాల్లోని రేషన్ డీలర్ల నుంచి మొదలయ్యే ఈ అక్రమ దందా పెద్ద పెద్ద రైస్ మిల్లర్లు, దళారుల మీదుగా అంతర్రాష్ట్ర సరిహద్దుల వరకు సాగుతోంది. కార్లు, ఆటోలు డీసీఎం వ్యాన్లు, చివరకు లారీల ద్వారా టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఒకెత్తయితే,రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ లోపాలను వాడుకుని లబ్ధిదారులకు తెలియకుండానే బియ్యాన్ని నొక్కేయడం మరొకెత్తు. ఇలా సేకరించిన బియ్యాన్ని పాలిష్ పట్టి, బ్రాండెడ్ సంచుల్లో నింపి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.మరికొన్ని చోట్ల ఈ బియ్యాన్ని ఏకంగా మద్యం తయారీ కేంద్రాలకు, పౌల్ట్రీ ఫారాలకు తరలిస్తుండటం గమనార్హం.నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగంఈ అక్రమ రవాణా అంతా స్థానిక పౌరసరఫరాల శాఖ,పోలీస్,రెవెన్యూ అధికారుల నిఘా వైఫల్యం వల్లే జరుగుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ఎక్కడైనా వాహనాలు పట్టుబడితే,కేవలం డ్రైవర్లపై లేదా చిన్నపాటి దళారులపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు తప్ప, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను, పెద్ద తిమింగలాలను పట్టుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కొన్ని చోట్ల తనిఖీల పేరిట ముందస్తు సమాచారం అందిస్తూ,మాఫియా నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.కంచే చేను మేసిన చందంగా అధికారులు వ్యవహరిస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడేదెలా?
వ్యవస్థ మారాలి.చర్యలు కఠినతరం కావాలి ఈ దోపిడీకి అడ్డుకట్ట పడాలంటే కేవలం మొక్కుబడి తనిఖీలు సరిపోవు.మూలాలపై దెబ్బకొట్టాలి.రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి.రేషన్ పంపిణీ వ్యవస్థను,రవాణా వాహనాలను పూర్తిగా జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి.అక్రమాలు జరిగిన ప్రాంతాల్లోని స్థానిక అధికారులను నేరుగా బాధ్యులను చేస్తూ శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. తమకు వచ్చే రేషన్ బియ్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి.పేదల ఆకలిని వ్యాపారంగా మార్చుకున్న అక్రమార్కులపై ప్రభుత్వం ఇకనైనా ఉక్కుపాదం మోపకపోతే, సంక్షేమ పథకాల ఆశయం నీరుగారిపోవడం ఖాయం..ఆటోలో తరలిస్తున్న రేషన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్న అధికారులు
పేదల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు: కంచే చేను మేస్తే కాపాడేదెవరు?
RELATED ARTICLES



