📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialప్రభుత్వ భూముల కబ్జాపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు!

ప్రభుత్వ భూముల కబ్జాపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు!

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో ప్రభుత్వ భూములు, ప్లాట్లు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయంటూ గ్రామానికి చెందిన పోడేటి శ్రీకాంత్ గౌడ్ ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ప్రభుత్వ ఆస్తులను కొందరు అక్రమార్కులు ఆక్రమిస్తున్నారని, వీటిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటకు తీయాలని శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. అక్రమ కబ్జాకు గురైన ప్లాట్లను వెంటనే స్వాధీనం చేసుకుని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపించాలని కోరుతూ .అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular