బెజ్జంకి, జూన్ 1(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధుల నుండి రూ.10 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు (బెజ్జంకి mandaగ్రామ సర్పంచ్
మ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థుల భద్రత, పాఠశాల అభివృద్ధి, గ్రామ విద్యా పురోగతిని దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేయడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. విద్యాభివృద్ధే గ్రామాభివృద్ధికి పునాది అనే సంకల్పంతో గ్రామ పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు గూడెం గ్రామం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు.అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ నిధుల మంజూరుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.




