📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircillaరాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ  అధికారిగా దేవునూరి శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ  అధికారిగా దేవునూరి శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ(Transport Department) అధికారిగా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న దేవునూరి శ్రీనివాస్(Devunuri Srinivas) నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా బదిలీల ఉత్తర్వుల్లో భాగంగా ఈ నియామకం జరిగింది. దేవునూరి శ్రీనివాస్ గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోటారు వాహనాల తనిఖీ అధికారిగా (ఎంవీఐ) పనిచేశారు. జిల్లాలో రవాణా శాఖకు సంబంధించిన వ్యవహారాలపై ఆయనకు విస్తృత అనుభవం, అవగాహన ఉంది.

కాగా, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్‌ను మంచిర్యాల జిల్లాకు మోటారు వాహనాల తనిఖీ అధికారిగా బదిలీ(Transfer) చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో గతంలో పనిచేసిన అనుభవం ఉన్న దేవునూరి శ్రీనివాస్ జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో శాఖ పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular