📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialసీసీ కెమెరాలతోనే నేరాలకు చెక్

సీసీ కెమెరాలతోనే నేరాలకు చెక్

📰 Generate e-Paper Clip

జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్

జైపూర్ ,జూలై22,ప్రజావాణి:

నేరాల నియంత్రణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం జైపూర్ ఏసీపీ కార్యాలయంలో సర్పంచులతో నిర్వహించిన సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దొంగతనాలు, ప్రమాదాల దర్యాప్తులో సీసీ ఫుటేజ్ కీలక ఆధారంగా నిలుస్తోందని, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో వీటి ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత, ప్రమాదరహిత జైపూర్‌ను నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ భూమేష్, ఎంపీఓ శ్రీపతి బాబురావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular