📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetపెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల పోరాటం-- సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి వెళ్తుండగా పోలీసుల...

పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల పోరాటం– సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి వెళ్తుండగా పోలీసుల అడ్డుకట్ట

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, జూన్ 1 (ప్రజావాణి)

గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలువురు మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మాజీ సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి పనులు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడంతో మాజీ సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేసి మాజీ సర్పంచులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, మొండయ్య, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, స్వామి, నరేష్, మల్లేశం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular