📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamనేను రాను "బిడ్డ సర్కారు" దవాఖానకు నిర్లక్ష్యానికి .. చిరునామా ఖమ్మం ప్రభుత్వ "దవాఖానలు

నేను రాను “బిడ్డ సర్కారు” దవాఖానకు

నిర్లక్ష్యానికి .. చిరునామా ఖమ్మం ప్రభుత్వ “దవాఖానలు

📰 Generate e-Paper Clip

నేను రాను “బిడ్డ సర్కారు” దవాఖానకు

నిర్లక్ష్యానికి .. చిరునామా ఖమ్మం ప్రభుత్వ “దవాఖానలు


జిల్లా వైద్య విధాన పరిషత్ లో అలా…? వైద్య ఆరోగ్యశాఖలో అలా..?

రోగుల ప్రాణాలతో చెలగాటం..
కిష్టమైన ఆపరేషన్కు.. రక్త పరీక్షల్లోనూ నిర్లక్ష్యం

కార్పొరేట్ వైద్యం దేవుడు ఎరుగు..

ఇంతకీ నిర్లక్ష్యానికి చర్యలు ఉంటాయా..?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా కేంద్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం తో పాటు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో నిరీక్షణ రోగుల పాలిట శాపంగా మారిందని బాధితులు రోగులు ఆరోపిస్తున్న నేపథ్యం. వచ్చామా వెళ్ళామా అనే విధంగా వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ ఆసుపత్రులలో ప్రజల ప్రాణాలు గాల్లో తేలుతూ ఉన్నట్లు సమాచారం.. మన ప్రజావాణి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి వీరభద్రం సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యవరం గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు కవల పిల్లలకు జన్మనిచ్చిన తలపాటి రేణుక కవల పిల్లలు ఓ బాలుడు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం మార్చి 4న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తం తక్కువగా ఉన్నదని రక్తం ఎక్కించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాలుడు వికలాంగుడిగా మారినట్లు తెలిసింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం పర్యవేక్షణలేని ఆర్ఎంవోల పనితీరు వలన నష్టం జరిగినట్లు తెలిసింది.
కాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని చెరువు మాధవరం గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భసంచిలో గడ్డ సమస్యతో బాధపడుతూ గత ఏడాది ఇటీవల కాలంలో ప్రభుత్వ దవాఖానలో వైద్యులను సంప్రదించినట్లు తెలిసింది ఆ మేరకు చేసిన పరీక్షల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. టీ హబ్ ద్వారా వచ్చిన పరీక్షల కంటే భిన్నంగా అమాంతం పెరిగిపోయిందని సమాచారం. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ నరేంద్ర కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఇటీవల ఆ మహిళకు కల్లూరు దవఖానలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రజా ప్రభుత్వం స్పందించి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా ప్రజలు ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular