పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల పోరాటం– సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి వెళ్తుండగా పోలీసుల అడ్డుకట్ట
బెజ్జంకి, జూన్ 1 (ప్రజావాణి) గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలువురు మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి పనులు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం...