📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్క్రీడా దుస్తులను పంపిణీ చేసిన శ్రీ కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీనివాసులు, జి తులసి రెడ్డి

క్రీడా దుస్తులను పంపిణీ చేసిన శ్రీ కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీనివాసులు, జి తులసి రెడ్డి

📰 Generate e-Paper Clip

ఆళ్లగడ్డ మే30(ప్రజావాణి) ఆళ్లగడ్డ ఆర్ ఆర్ అకాడమీ క్రీడాకారులకు శ్రీ కన్స్ట్రక్షన్ అధినేత శ్రీనివాసులు మరి మరియు తులసి రెడ్డి 30 మంది క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ కన్స్ట్రక్షన్స్ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ వైపిపిఎం క్రీడా మైదానంలో మా చిన్నతనం నుండి ఇక్కడ ఆడుకునే వారమని అప్పట్లో సరైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు గాని కోచ్ లేరని ఆ రోజుల్లో మాకు ఆ అవకాశం లేదని కానీ ఇప్పుడు ఇదే క్రీడా మైదానంలో ఆటలు ఆడుకొని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేటువంటి ఒక కోచ్ గా సుబ్బరాయుడు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు మేమెంతో గర్విస్తున్నాము అదేవిధంగా శ్రీ సోమల రమణారెడ్డి ఆర్ఆర్ అకాడమీ నుండి క్రికెట్ హ్యాండ్ బాల్,ఫుట్బాల్ రెస్లింగ్ రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో పథకాలు సాధించినటువంటి క్రీడాకారులు తయారవుతున్నారు అంటే అది మన ఆళ్లగడ్డ కే గర్వకారణమని క్రీడాకారులకు ఎప్పటికీ మా యొక్క సేవలు చేస్తూ ఉంటామని శ్రీనివాసులు తెలిపారు జి తులసి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తి జీవితానికి వ్యాయామం ఎంత అవసరమని ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆటలు ఆడుకోవడం వలన దేహదారుఢ్యం తో పాటు ఆరోగ్యంగా ఉంటారని వాటితోపాటు మంచి ప్రతిభ ఉన్న వారు జిల్లా రాష్ట్రస్థాయి జాతీయస్థాయి ఆటల పోటీలలో కూడా రాణించగలరని తద్వారా విద్యా ఉద్యోగ అవకాశాలలో క్రీడా సర్టిఫికెట్లు ఉపయోగపడతాయని వారు అన్నారు కోచ్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆర్ ఆర్ అకాడమీ నుండి దాదాపుగా 2025 – 2026 సంవత్సరంలో 20 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వారు ఉన్నారు అని ఇంకా మంచి శిక్షణ ఇచ్చి జాతీయస్థాయి లో ఆళ్లగడ్డ పేరును గుర్తుంచుకునే విధంగా చేయడమే మా ఆర్ ఆర్ అకాడమీ నిర్వాహకులైనటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎస్ వి ఎన్ హరి ప్రసాద్ రెడ్డి,డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం టి వినోద్ కుమార్ ప్రధమ లక్ష్యం అని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.