📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి - కాకాణి"

లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి – కాకాణి”

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా(మే30 ప్రజావాణి) నెల్లూరు వైస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్  డీఎస్సీ అక్రమాల్ని ఆధారాలతో సహా బయటపెట్టాం
-మా ఆరోపణలకు తూతూ మంత్రంగా అధికారులు ఖండన ఇచ్చారు
– మేం లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేదు
– డీఎస్సీ అక్రమాలపై జూన్ 1న కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించబోతున్నాం
– డీఎస్సీ స్కాంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు జరిపించే వరకూ వెనక్కి తగ్గం తవ్వేకొద్దీ బయట పడుతున్న ప్రభుత్వ లీలలు. టీచర్‌ ఉద్యోగాలు అంటూ ఊరించి నిస్సిగ్గుగా పోస్టులు అమ్ముకున్న చంద్రబాబు ప్రభుత్వం.అర్హులైన అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపి,సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక కూడా,తుది జాబితాలో వారి పేర్లు గల్లంతు.మెరిట్‌ లిస్ట్, సెలక్షన్‌ లిస్టు.రెండూ ప్రకటించకుండా ఎంపిక చేసిన అభ్యర్థులకు నేరుగా మెసేజ్‌ల ద్వారా సమాచారం.ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిల్చిన ప్రభుత్వం.కానీ,ఆ అర్హులకు ఇటు ఉద్యోగాలు ఇవ్వలేదు.అటు వారిని రిజెక్టెడ్‌ లోనూ చూపలేదు.  అభ్యర్థులు గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేస్తే, తప్పుడు సమాచారం ఇచ్చి,చేతులు దులుపుకున్న అ«ధికారులు.అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా,ఆ ఆదేశాన్ని బేఖాతరు చేస్తూ.. అప్పటికే అర్హులైన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు కోర్టుకు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం.డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ రోస్టర్‌ ప్రకారం అభ్యర్థులకు వచ్చిన మార్కుల మార్కులతో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేయాలి.కానీ డీఎస్సీ–2025 అందుకు భిన్నంగా నిర్వహించారు.ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం,సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం,తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేశారు.అలా పరీక్ష రాసిన అభ్యర్థులకు మెరిట్‌ లిస్ట్‌ పరిశీలించే వీలు లేకుండా చేశారు.మామూలుగా ఏ పరీక్షలో అయినా,మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించిన తర్వాత సెలక్షన్‌ లిస్టు తయారుచేసి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.కానీ,ఈ డీఎస్సీ 2025లో మాత్రం,ఆ పద్ధతి మార్చి.మెరిట్‌ లిస్ట్,సెలక్షన్‌ లిస్ట్‌ లేకుండా నేరుగా సెలెక్టెడ్‌ అభ్యర్థులకు.ఒక పోస్టుకు ఒకరి చొప్పున మాత్రమే ఎంపిక చేసి,సర్టిఫికెట్ల పరిశీలనకు పిల్చారు.చివరకు వారికి కూడా మొండిచెయ్యి చూపారు.ఇన్ని అక్రమాలతో నిర్వహించిన,అంతులేని అవినీతి జరిగిన డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలి.వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, బాధ్యత వహించి రాజీనామా చేయాలి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.