📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్తమ్మనపల్లి పంచాయతీ ఉపఎన్నికలో టీడీపీ ఘనవిజయం: కూటమి నాయకులకు లక్కినేని సురేష్ హృదయపూర్వక ధన్యవాదాలు!

తమ్మనపల్లి పంచాయతీ ఉపఎన్నికలో టీడీపీ ఘనవిజయం: కూటమి నాయకులకు లక్కినేని సురేష్ హృదయపూర్వక ధన్యవాదాలు!

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (పోరుమామిళ్ల) నవంబర్ 07ప్రజావాణి వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్ల మండలం తమ్మనపల్లి పంచాయతీ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి 1759 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, స్థానిక నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ అఖండ విజయంపై స్థానిక ప్రముఖ నాయకులు లక్కినేని సురేష్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడి, కూటమికి పట్టం గట్టిన ఓటర్లందరికీ ఆయన శిరస్సు వంచి నమస్కరించారు.ఈ సందర్భంగా లక్కినేని సురేష్ మాట్లాడుతూ.దమ్మనపల్లి పంచాయతీలో టీడీపీ జెండా ఎగరడానికి అహర్నిశలు శ్రమించిన తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులకు, కార్యకర్తలకు,అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.కూటమిలోని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో సమన్వయంతో కష్టపడి పనిచేయడం వల్లే ఈ స్థాయిలో మెజారిటీ సాధ్యమైందని ఆయన కొనియాడారు.

బద్వేల్ ఇన్చార్జ్ సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు

ఈ విజయానికి ప్రధాన శిల్పి,బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి కి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని లక్కినేని సురేష్ తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి స్థానిక నాయకులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ,సరైన దిశానిర్దేశం చేశారని గుర్తుచేశారు.ఆయన చూపిన చొరవ,వ్యూహాత్మక అడుగులే ఈ రోజు 1759 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడానికి దోహదపడ్డాయని సురేష్ కొనియాడారు.

మాజీ సర్పంచ్ యనమల సుధాకర్ కృషి అమోఘం

అదేవిధంగా,ఈ ఎన్నికల్లో తమ్మనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ యనమల సుధాకర్ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని సురేష్ కొనియాడారు.గ్రామంలో యనమల సుధాకర్‌కు ఉన్న మంచి పేరు,గతంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు,ఈ ఎన్నికల్లో ఆయన పడ్డ కష్టం కూటమి అభ్యర్థి విజయానికి బలమైన పునాది వేసిందని ప్రశంసించారు.స్థానిక ఓటర్లను ప్రచారంలో ఏకం చేయడంలో సుధాకర్ శ్రమను ప్రత్యేకంగా అభినందించారు.

దమ్మనపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం

ఈ గెలుపు కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాదని, తమ్మనపల్లి పంచాయతీని ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశమని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా,మంచూరి సూర్యనారాయణ రెడ్డి,సహకారంతో ద మ్మనపల్లి పంచాయతీలోని అన్ని సమస్యలను పరిష్కరించి, ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దుతామని కూటమి నాయకులు స్పష్టం చేశారు. ఈ విజయంతో పోరుమామిళ్ల మండలంలోని టీడీపీ,జనసేన,బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.