నేరేడుచర్ల (ప్రజావాణి):నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నరసయ్య గూడెంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కొణతం నాగిరెడ్డి ఆధ్వర్యంలో “సర్ సర్వే” పై కార్యకర్తలకు దిశానిర్దేశ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ….ప్రతి బూత్ పరిధిలో బీఎల్ఓ-2 గా ఒక పార్టీ కార్యకర్తను నియమిస్తున్నట్లు తెలిపారు.బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై సర్వే నిర్వహించడంలో బీఎల్ఓ-2లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఓటరు జాబితా ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాగే ఇటీవల జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కడారి ఎల్లయ్య, ఉరిమూళ్ళ రామ్మూర్తి లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏమిరెడ్డి శంకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బాల వెంకటేశ్వర్లు, జిల్లా ట్రెజరర్ తాళ్ల నరేందర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు జూలూరి అశోక్, గంధం శావయ్య, కార్యదర్శి కాంపల్లి నారాయణరెడ్డి, తాటికొండ పరమేశ్వర్ రెడ్డి, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి , కొప్పు లక్ష్మీనారాయణ, వెన్నం సురేష్, దేవిరెడ్డి నాగిరెడ్డి, కాల్వ సైదులు , బుస్సా విమల, చేపూరి కృష్ణవేణి మరియు తదితరులు పాల్గొన్నారు
సర్ సర్వేపై బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం.
0
51
- Advertisment -



