సర్ సర్వేపై బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం.
నేరేడుచర్ల (ప్రజావాణి):నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నరసయ్య గూడెంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కొణతం నాగిరెడ్డి ఆధ్వర్యంలో “సర్ సర్వే” పై కార్యకర్తలకు దిశానిర్దేశ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ....ప్రతి బూత్ పరిధిలో బీఎల్ఓ-2 గా ఒక పార్టీ కార్యకర్తను నియమిస్తున్నట్లు తెలిపారు.బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై సర్వే నిర్వహించడంలో బీఎల్ఓ-2లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఓటరు జాబితా ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని...