📄 ePaper
Sunday, July 19, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఘాట్ కేసర్ లో 22.3 సెంటీమీటర్ల వర్షపాతం.. గాలివాన బీభత్సం

ఘాట్ కేసర్ లో 22.3 సెంటీమీటర్ల వర్షపాతం.. గాలివాన బీభత్సం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, మే 25 (ప్రజావాణి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో సోమవారం కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఘట్‌కేసర్, కొండాపూర్, ఎన్‌ఎఫ్‌సీ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ సందర్భంగా ఘట్‌కేసర్ పరిధిలో 22.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎమ్మార్వో చంద్రశేఖర్ తెలిపారు. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకుని చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular