📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఅకాల వర్షంతో కూలిన ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్...

అకాల వర్షంతో కూలిన ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్ నాయకుల హామీ

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 26(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి గ్రామపంచాయతీ అనుబంధ మల్లెంచెర్వు గ్రామంలో ఇటీవల కురిసిన ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు లింగాల శ్రీనివాస్ మానకొండూర్ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ సూచనలతో గ్రామాన్ని సందర్శించిన ఆయన, ఈదురుగాలులకు కాశావేని ఎల్లయ్య, బండ మల్లయ్య ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో జరిగిన నష్టాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ, బెజ్జంకి మండలంలోని ఈదురుగాలులు, అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రేగులపల్లి గ్రామ సర్పంచ్ జంగిలి తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు జిల లింగం, వార్డు సభ్యుడు శంభు తిరుపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొంకటి రాములు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శానగొండ శ్రావణ్ కుమార్, జంగిలి సంపత్, జంగిటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
రౌడీ షీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్ తిరిగి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద చర్యలు : సీఐ విద్యాసాగర్ బెజ్జంకి, మే 26 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిద్దిపేట రూరల్ సర్కిల్ సీఐ చి. విద్యాసాగర్, బెజ్జంకి ఎస్‌ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని అధికారులు స్పష్టం చేశారు. గ్రామ వివాదాలు, భూ తగాదాలు, దాడులు, బెదిరింపులు, జూదం, మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, మహిళలను వేధించడం వంటి సంఘ వ్యతిరేక చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాత నేర ప్రవర్తనలను విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి సక్రమ మార్గంలో జీవించాలని సూచించిన పోలీసులు, గ్రామాల్లో అనుమానాస్పద సంఘటనలు కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ, బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా తిరిగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఐ తోట తిరుపతి మాట్లాడుతూ యువ
RELATED ARTICLES
- Advertisment -

Most Popular