ఈసారి గోవధ వద్దు..సామరస్యంతో బక్రీద్ జరుపుకుందాం.!
అవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తి..
_ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దల కీలక పిలుపు.._
బక్రీద్ పండుగను త్యాగానికి, సేవాభావానికి ప్రతీకగా జరుపుకోవాలని సూచన..
సమాజంలో శాంతి, సోదరభావం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత..
బక్రీద్ అంటే కేవలం ఖుర్బానీ మాత్రమే కాదని.. పేదలకు సహాయం, పంచుకోవడం, మానవత్వం ప్రధాన సందేశమని వివరించిన మత పెద్దలు..
గోవధ పేరుతో కొన్ని ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమని ఆవేదన..
మతాల మధ్య చిచ్చు పెట్టే చర్యలకు ఎవరూ పాల్పడొద్దని హెచ్చరిక..
దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలి.. *పరస్పర గౌరవమే!* నిజమైన దేశభక్తి అంటూ పిలుపు..
కేంద్ర ప్రభుత్వం *ఆవును జాతీయ జంతువు* గా ప్రకటిస్తే వివాదాలకు పూర్తిగా తెరపడే అవకాశం ఉందని అభిప్రాయం..
యువత సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలకు దూరంగా ఉండాలని సూచన..
బక్రీద్ పండుగను ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు, పేదలకు ఆహార పంపిణీతో శాంతియుతంగా నిర్వహించాలంటూ విజ్ఞప్తి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన మత పెద్దలు మౌలానా అత్తర్ సాబ్, హఫీజ్ ఖలీల్, మౌలానా మగ్దమ్ సాబ్, ముఫ్తీ సిద్ధిక్ అహ్మద్ షా సహాబ్ సంయుక్తంగా కీలక ప్రకటన..

