prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 1:23 pm Digital Edition : RAJASHEKARREDDY

అకాల వర్షంతో కూలిన ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్ నాయకుల హామీ

 

బెజ్జంకి, మే 26(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి గ్రామపంచాయతీ అనుబంధ మల్లెంచెర్వు గ్రామంలో ఇటీవల కురిసిన ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు లింగాల శ్రీనివాస్ మానకొండూర్ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ సూచనలతో గ్రామాన్ని సందర్శించిన ఆయన, ఈదురుగాలులకు కాశావేని ఎల్లయ్య, బండ మల్లయ్య ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో జరిగిన నష్టాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ, బెజ్జంకి మండలంలోని ఈదురుగాలులు, అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రేగులపల్లి గ్రామ సర్పంచ్ జంగిలి తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు జిల లింగం, వార్డు సభ్యుడు శంభు తిరుపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొంకటి రాములు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శానగొండ శ్రావణ్ కుమార్, జంగిలి సంపత్, జంగిటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.