ఎన్టీఆర్ జిల్లా (మే25 ప్రజావాణి) వత్సవాయి గ్రామం రవి ఫ్లై యాష్ బ్రిక్స్ లో గుట్టలుగా ఇసుక ఫ్లైయాష్ నిల్వలు -రాత్రికి రాత్రే మాయం చేస్తున్న మాఫియా -నేతల అండతో యథేచ్ఛగా దందా.ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి గ్రామ శివారులో ‘రవి ఫ్లైయాష్ బ్రిక్స్’పేరుతో సాగుతున్న భారీ ఇసుక దందా రోజురోజుకి జోరు అందుకుంటుంది బ్రిక్స్ తయారీ ముసుగులో లారీల కొద్దీ ఇసుకను తరలిస్తున్న వైనం.నిద్రపోతున్న రెవెన్యూ యంత్రాంగం ‘రవి ఫ్లైయాష్ బ్రిక్స్’అని రాసి ఉన్న బోర్డు వెనుక భారీగా ఇసుక గుట్టలు,ముందు భాగంలో ఫ్లైయాష్ కుప్పలు ఉన్నాయి.బ్రిక్స్ తయారీకి అవసరమైన దానికంటే వందల రెట్లు ఎక్కువ ఇసుక నిల్వలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.వత్సవాయి గ్రామస్తుల ఆరోపణ”పగలు ఈ గుట్టలు చూపించి బ్రిక్స్ కంపెనీ అని నమ్మిస్తారు.రాత్రి అయ్యేసరికి టిప్పర్లు, లారీలతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు 10-15 లారీలు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి అని పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానికుడు తెలిపాడు.నేతల అండ – అధికారుల మౌనం:ఈ అక్రమ దందా వెనుక స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉందని, అందుకే మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.”ఫిర్యాదు చేస్తే ‘వాళ్లది లైసెన్స్ ఉన్న బ్రిక్స్ కంపెనీ’ అని దాటవేస్తున్నారు.మరి ఇంత ఇసుక వాళ్లకు ఎక్కడి నుంచి వస్తుంది బిల్లులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.ఇసుక లారీల రాకపోకలతో గ్రామ రోడ్డంతా దుమ్ము,ధూళిమయం.దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోజూ ప్రమాదాలు.ఇళ్లలోకి చేరే ఫ్లైయాష్,ఇసుక రేణువులతో పిల్లలు,వృద్ధులకు దగ్గు,ఆయాసం.నిబంధనలు ఏం చెబుతున్నాయి ఫ్లైయాష్ బ్రిక్స్ తయారీకి పరిమిత స్థాయిలోనే ఇసుక వాడాలి. అక్రమంగా నిల్వ చేసినా,అమ్మినా ఏపీ వాల్టా చట్టం, మైనింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసి లారీలను సీజ్ చేసే అధికారం ఉంది. అనుమతి లేకుండా ఇసుక నిల్వ చేస్తే 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా,2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.ప్రజల డిమాండ్:1.రవి ఫ్లైయాష్ బ్రిక్స్’ కంపెనీపై విజిలెన్స్,మైనింగ్ శాఖ సంయుక్త దాడులు చేయాలి.2.ఇసుక నిల్వలకు సంబంధించిన బిల్లులు,అనుమతులు పరిశీలించాలి.3.అక్రమ రవాణాకు వాడుతున్న లారీలను సీజ్ చేసి,యజమానులపై కేసులు పెట్టాలి.4.కంపెనీకి సహకరిస్తున్న అధికారులు,నేతలపై చర్యలు తీసుకోవాలి.-ఇసుక గుట్టలు: బ్రిక్స్ తయారీకి మించి భారీగా ఇసుక నిల్వలు- ఫ్లైయాష్ కుప్పలు:తయారీ ముడి సరుకు పేరుతో డంపింగ్ దీనిపై కంపెనీవారిని అడగగా నా దగ్గర 20 కుటుంబాలు బ్రతుకుతున్నాయని నేనే వాళ్లకు దిక్కు అని చిలక పలుకులు పలికాడు.అతని దాంట్లోనే వందల లారీలు కొద్దీ ఇసుక డంపు ఏంటని అడగగా మేము ఇటికలు తయారు చేయడానికి ఇసుక డంపు చేశామని డబ్బు చేసిన ఇసుక అటు ఇటు మారుస్తామని తెలిపాడు.అక్కడ కొంతమంది ప్రజల్ని అడగగా ఉదయం ఇసుక తోలుతూనే ఉంటారు రాత్రి మాయమవుతా ఉంటదని తెలిపారు.సంబంధిత రెవిన్యూ యంత్రాంగం పట్టించుకోరని కారణాలు ప్రజలకే తెలియాలని కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవస్థని అంటే దాన్ని వెనకాల పెద్ద కథే ఉంటుందని పేర్కొన్నారు.వత్సవాయి గ్రామ ప్రజలు కలెక్టర్ వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదని ఇక్కడున్న నాయకులు రవీనియంతరంగం కలిసే పని చేస్తున్నారని ఈ రవి ఫ్లై యాస్ బ్రిక్స్ కు వందల లారీలు ఈ కంపెనీకి ఏం అవసరం అని దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వచ్చి పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారు మరిన్ని వివరాలతో కథనం 2 ప్రజావాణి లో త్వరలో
వత్సవాయి గ్రామం రవి ఫ్లైయాష్ బ్రిక్స్’ ముసుగులో భారీ ఇసుక దందా
0
17
RELATED ARTICLES
- Advertisment -


