యోగివేమన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలపై ఆన్ లైన్ పి.జి.ఆర్.ఎస్ నందు పిర్యాదు చేస్తే సకాలంలో సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యోగివేమన యూనివర్సిటీ సిడిసి డీన్ రఘుబాబు ను బాధ్యతల నుండి వెంటనే తొలగించాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఏ.ఐ.ఎస్.బి కార్యాలయంలో వారు మాట్లాడుతూ.యోగివేమన యూనివర్సిటీ పరిధిలోని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలలపై ఆన్ లైన్ పి.జి.ఆర్.ఎస్ నందు పిర్యాదు చేస్తే గడువులోగా సమస్యను పరిష్కరించాలని ఉన్నా కూడా యూనివర్సిటీ సిడిసి డీన్ రఘుబాబు సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు అన్నారు. సమస్యను 30 రోజుల గడువు లోపల పరిష్కరించాలని గడువు ఇస్తే 3 నెలల అయిన కూడా పరిష్కరించకుండా ఉన్నఫళంగా పెండింగ్ లో ఉన్న సమస్యలన్ని పరిష్కరించడానికి కమిటీ వేస్తున్నాం కమిటీ నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాం అని పి.జీ.ఆర్.ఎస్ పెండింగ్ సమస్యలన్నీ ఆన్ లైన్ లో క్లోజ్ చేశారని వారు తెలిపారు. పిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకున్న తరువాతే ఆన్ లైన్ లో క్లోజ్ చేయాలి తప్ప సమస్య పరిస్కరించకుండానే పిర్యాదును క్లోజ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలలకు కొమ్ము కాస్తూ వచ్చిన పిర్యాదులను పరిష్కరించకుండా పెండింగ్ లో పెట్టి అన్ని పెండింగ్ పిర్యాదులను ఏకకాలంలో క్లోజ్ చేయడం వెనుక అంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. పి.జి.ఆర్.ఎస్ పిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలు పాటించని కళాశాలలకు కొమ్ము కాస్తున్న సి.డి.సి డీన్ రఘు బాబు ని వెంటనే తొలగించి వచ్చిన పిర్యాదులపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తారు. లేనిపక్షంలో యూనివర్సిటీ వద్ద ప్రత్యక్ష ఆందోళన చేపడతామని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బి నాయకులు బాలు, పవన్ లు పాల్గొన్నారు.
Homeఎడిటోరియల్సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైవియూ సిడిసి డీన్ ను తొలగించాలి: - ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర...
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైవియూ సిడిసి డీన్ ను తొలగించాలి: – ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్.
0
11
- Advertisment -


