సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైవియూ సిడిసి డీన్ ను తొలగించాలి: – ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్.
యోగివేమన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలపై ఆన్ లైన్ పి.జి.ఆర్.ఎస్ నందు పిర్యాదు చేస్తే సకాలంలో సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యోగివేమన యూనివర్సిటీ సిడిసి డీన్ రఘుబాబు ను బాధ్యతల నుండి వెంటనే తొలగించాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఏ.ఐ.ఎస్.బి కార్యాలయంలో వారు మాట్లాడుతూ.యోగివేమన యూనివర్సిటీ పరిధిలోని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలలపై ఆన్ లైన్ పి.జి.ఆర్.ఎస్ నందు పిర్యాదు చేస్తే గడువులోగా సమస్యను పరిష్కరించాలని ఉన్నా కూడా...