📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు,డీసీసీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి...

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు,డీసీసీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి

📰 Generate e-Paper Clip

కడప (మే21ప్రజావాణి) కడపలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు భారత మాజీ ప్రధానమంత్రి,భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి.విజయ జ్యోతి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయ ప్రాంగణంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా విజయ జ్యోతి విలేకరులతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పరిచయం చేసిన దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు.యువతకు ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం,కంప్యూటర్ మరియు టెలికాం రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయడం వంటి ఎన్నో సంస్కరణలను ఆయన చేపట్టారని పేర్కొన్నారు.రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న జన్మించి,1984లో భారతదేశ అత్యంత యువ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. దేశాన్ని 21వ శతాబ్దం వైపు తీసుకెళ్లాలనే దూరదృష్టితో సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద జరిగిన దుర్ఘటనలో ఆయన మరణించడం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.దేశ ప్రయోజనాలను కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెట్టిన మోదీ,అమిత్ షా లు ద్రోహులు పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తత ల కారణంగా చమరు వినియోగం తగ్గించుకోవాలని మోదీ పొదుపు చర్యలు సూచించారన్నారు.కానీ అంబానీ మాత్రం తన చమురును బయట దేశాలకు ఎగుమతి చేస్తూ ఆ వచ్చిన డబ్బును ఫండ్ గా మోడీకి ఇస్తున్నారని విజయ జ్యోతి విమర్శించారు.పెద్ద నోట్ల రద్దు,కోవిడ్ కష్టాల నుంచి దేశంలో చమురు సంక్షేమం వరకు.ప్రతిదానికి మోదీ,అమిత్ షా,ఆర్ఎస్ఎస్ లదే బాధ్యతను విమర్శించారు.దేశాన్ని భయంకరమైన ఆర్థిక సంక్షోభం ముంచెత్తనున్నదని విజయ జ్యోతి మరోసారి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్,జిల్లా మహిళా అధ్యక్షురాలు సుభాన్ బి,కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీనివాసులు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మూరతోటి విజయకుమార్ నందిమండలం సుశీల్ కుమార్,మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమల్ బాషా,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఆర్టిఐ విభాగం ఉపాధ్యక్షులు కోటపాటి లక్ష్మయ్య,జవహర్ బాలమంచు జిల్లా అధ్యక్షులు పుల్లూరు భాష నందిమండలం వెంకటసుబ్బయ్య షామీర్ హుస్సేన్, షబానా,శీలం గంగయ్య, హరిప్రసాద్,హమీద్ జహీర్ గౌస్,నాయబ్ రసూల్,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.