రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు,డీసీసీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి
కడప (మే21ప్రజావాణి) కడపలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు భారత మాజీ ప్రధానమంత్రి,భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి.విజయ జ్యోతి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయ ప్రాంగణంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా విజయ జ్యోతి విలేకరులతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పరిచయం చేసిన దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు.యువతకు ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం,కంప్యూటర్ మరియు టెలికాం రంగాలకు...