📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి : ఎమ్మెల్యే డా. దాసరి సుధ

పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి : ఎమ్మెల్యే డా. దాసరి సుధ

📰 Generate e-Paper Clip

బద్వేల్ (మే18 ప్రజావాణి)-పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బద్వేల్ ఆర్డీవోకు ఎమ్మెల్యే దాసరి సుధా వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారుతుందని తెలిపారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం ధరలను పెంచడం ద్వారా ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ ధరల పెంపు వల్ల రైతాంగంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు రవాణా ఖర్చులు పెరిగి మార్కెట్‌లో అన్ని వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.ఇంధన ధరల పెంపు పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.