తిరుపతి జిల్లా (మే 17 ప్రజావాణి)-పదవ తరగతి,ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, నగదు బహుమతుల ప్రదానం.తల్లిదండ్రుల కష్టానికి పిల్లలు ఇచ్చే గొప్ప బహుమతి చదువే” జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచన.తిరుపతి,శ్రీకాళహస్తి ఇటీవల నిర్వహించిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విశిష్ట మార్కులు సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత. స్థానిక శాసన సభ్యులు శ్రీ బొజ్జల సుదీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఐఏఎస్.జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్.తదితరులు సంయుక్తంగా ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు మరియు నగదు బహుమతులను అందజేసి వారి కృషిని అభినందించారు.విధి నిర్వహణలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే పోలీస్ సిబ్బంది తమ కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ పిల్లలకు ఉత్తమ విద్య అందించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.ఈ సందర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ,విద్యార్థులు సాధించిన ఫలితాలు వారి కృషికి, తల్లిదండ్రుల అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు.విద్యనే వ్యక్తిత్వ వికాసానికి,సమాజాభివృద్ధికి ప్రధాన ఆధారమని తెలిపారు.పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిడులు,సవాళ్లు ఎదుర్కొంటూనే తమ పిల్లల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు.
కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడం ద్వారా తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని విద్యార్థులకు సూచించారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో క్రమశిక్షణ,సమయపాలన లక్ష్యసాధన వంటి విలువలు విద్యార్థులను విజయపథంలో నడిపిస్తాయని తెలిపారు.విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా మంచి వ్యక్తిత్వం,సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.భవిష్యత్తులో రాష్ట్రం,దేశానికి సేవ చేసే స్థాయికి ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బారాయుడు ఐపీఎస్.మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు.ఆ కష్టానికి పిల్లలు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి ఏదైనా ఉంటే అది మంచి చదువు, మంచి ప్రవర్తనే. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలనతో విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని సూచించారు.అలాగే విద్యార్థులు సాధించిన విజయాలు పోలీస్ కుటుంబాలకు గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో సివిల్స్, వైద్య, ఇంజినీరింగ్, సైన్స్ తదితర రంగాల్లో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత ఉత్తేజం కలుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బంది పిల్లల విద్యా ప్రతిభకు ఘన సన్మానం..విద్యార్థుల విజయాలను అభినందించిన రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు.
RELATED ARTICLES




