📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రారంభమైన క్రీడా & యువజన వారోత్సవాలు

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రారంభమైన క్రీడా & యువజన వారోత్సవాలు

📰 Generate e-Paper Clip

*ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రారంభమైన క్రీడా & యువజన వారోత్సవాలు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న క్రీడా, యువజన వారోత్సవాల కార్యక్రమం సోమవారం నాడు చండూరు మున్సిపాలిటీ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ఎంఈఓ ఉట్కూరు సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో బి. యాదగిరి మరియు కౌన్సిలర్లు హాజరై వారు మాట్లాడుతూ యువత, విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి క్రీడల పట్ల అవగాహన పెంచడం, యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం నాడు స్థానిక చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్థానిక ఫిజికల్ డైరెక్టర్లు, చండూరు పట్టణ యూత్, వాకర్స్, విద్యార్థులు మొదలైన వారితో ధ్యానం, యోగ , చండూరు మెయిన్ రోడ్ వెంట 2 కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కటకం రమేష్, తేలుకుంట రాజకుమారి చంద్రశేఖర్, జెల్ల ధనమ్మ శ్రీనివాసులు, కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది , పంచాయతి కార్యదర్శులు మొదలైన వారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.