కడప (మే15) ప్రజావాణి న్యూస్ నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ ఉచిత పంటల బీమా పథకం కు మంగళం పాడిన రాష్ట్ర ప్రభుత్వం.ఎరువుల సరఫరా లో ప్రభుత్వ నిర్లక్ష్యం బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఎరువులు విక్రయం.రైతులు పండించిన పంటల ఉత్పత్తులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం.అన్నదాత సుఖీభవ ఎన్నికల హామీని కుదించిన ప్రభుత్వం.డ్రోన్ల సబ్సిడీలో భారీ అవినీతి,అక్రమాలు.రైతంగానికి అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజం.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవహరించి వ్యవసాయం పండుగ చేస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకొని వ్యవసాయాన్ని దండగ చేసిందని ఈ ప్రభుత్వానికి రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించే అర్హత లేదని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా రైతు పోరాట సమితి మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కడప నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉచిత పంటల భీమాకు రైతుల తరఫున ప్రభుత్వమే భీమా ప్రీమియంను చెల్లించి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా బీమా పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలోకి జమ అయ్యే పరిస్థితులు మనం చూసామని,ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పలికి గడిచిన రెండు సంవత్సరాలుగా రైతులు పంటలవారీగా ప్రీమియం ను సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించినప్పటికీ రాష్ట్రం వాటా సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించకపోవడం వలన రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని ఆయన విరుచుకుపడ్డారు.2026 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి దేశవ్యాప్తంగా సుమారు 12,200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా చెల్లించకపోవడం వలన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మన రాష్ట్ర రైతులకు అందక రైతులు చెల్లించిన ప్రీమియం వృధాగా పోగా రైతుల ఆశలపైన నీళ్లు చెల్లిందని ఆయన ఆందోళన వ్యక్తపరిచారు.అదేవిధంగా గత జగనన్న ప్రభుత్వంలో తొలి ఏడాది 2020 డిసెంబర్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.48 లక్షల మంది రైతులకు 1252 కోట్ల రూపాయల నిధులు పసలు బీమా యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలకు జమ అయినాయి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల అయినప్పటికీ మన జిల్లా రైతులకు ఒక రూపాయి కూడా ఇప్పటివరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా లబ్ధి చేరకపోవడం ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకుందని ఆయన మండిపడ్డారు.వైయస్సార్ కడప జిల్లాలో ముఖ్యంగా వరి,కంది, వేరుశనగ ,మినుము, ప్రత్తి, శనగ, పెసర మొదలైన పంటలను సుమారు రెండు లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి సుమారు 1,30,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా కేవలం గత సంవత్సరం 80 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోందని ఇందులో ప్రధానంగా 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా కేవలం 30 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే రైతులకు అందుబాటులో ఉంచారని, రైతులకు సకాలంలో కావలసిన ఎరువులు పంపిణీ చేయలేక ప్రధానంగా యూరియా 266.50 రూపాయలు ఒక బస్తా ఎమ్మార్పీ ధర ఉండగా అందుకు భిన్నంగా బ్లాక్ మార్కెట్లో 400 నుంచి 500 రూపాయల వరకు రైతులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని,ఒకవైపు రైతులకు కావాల్సిన ఎరువులు సకాలంలో అందక మరొకవైపు అధిక రేట్లకు వెచ్చించి రైతులు అప్పులు పాలు అవుతున్నారని ఆయన వివరించారు.వ్యవసాయ యాంత్రికరణ పథకం ద్వారా రైతులకు కావలసిన వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు గత రెండు సంవత్సరాలుగా సబ్సిడీలో రైతులకు అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు.రైతులు పండించిన పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని, మరొకవైపు పండించిన ఉత్పత్తులకు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు పండించిన ఉత్పత్తులకు ముందస్తుగా మద్దతు ధర ప్రకటించడం మరియు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో రైతు పక్షపాత ప్రభుత్వంగా నిలబడిందని ఆయన కితాబు ఇచ్చారు.గత ప్రభుత్వంలో రైతులు పండించే పంటలకు అకాల వర్షాలు మరియు ఈదులుగాలు వలన తీవ్ర నష్టం వాటిల్లినప్పుడు పంట నష్టపరిహారాన్ని అదే పంట సీజన్లో నష్టపోయిన 30 రోజుల లోపల ఆయా రైతులకు నష్టపరిహారాన్ని నేరుగా వారి ఖాతాలో జమ చేసే విధానం ఉండేది నేటి ప్రభుత్వంలో అకాల వర్షాల వలన మరియు ఈదురుగాలుల వలన నష్టపోయిన పంటలకు గత రెండు సంవత్సరాలుగా మన జిల్లాకు సంబంధించి నిధులు విడుదల కాకపోవడం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తపరిచారు.రాష్ట్ర ప్రభుత్వం నాటి ఎన్నికల హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి 20 వేల రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తామని ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ తో కలిపి 20 వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు మూడు విడతలుగా ఇవ్వడం ఎన్నికల హామీ ఉల్లంఘనగా పరిగణించాలన్నారు.అదేవిధంగా గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది రైతులకు 80 శాతం సబ్సిడీలో డ్రోన్లు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క డ్రోన్ పది లక్షల రూపాయలు పూర్తి ధర కాగా 80 శాతం సబ్సిడీ తో ఇవ్వడం జరిగిందని,ఇందులో భారీగా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని కేవలం 4 లక్షల రూపాయలు పూర్తి ధర తో అందుబాటులో ఉన్నాయని వీటిని పది లక్షల రూపాయలు పూర్తి ధర గా నిర్ణయించడం మరియు 80 శాతం సబ్సిడీ ఇవ్వడం రైతులను నట్టేట ఉంచడం కాదా?అని ఆయన సూటిగా ప్రశ్నించారు.అన్ని రకాలుగా రైతులకు చేరాల్సిన వివిధ రకాల సబ్సిడీ పథకాలు,పంట నష్టపరిహారం, ప్రధానమంత్రి పసల్ బీమా యోజన, రైతులకు సకాలంలో ఎరువులు,విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో మే 22 నుంచి 24 వరకు రైతు పండుగ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం హాస్యాస్పదమని ఇది రైతు పండుగ కార్యక్రమం కాదు రైతులకు దండగ కార్యక్రమం అని జిల్లా రైతులు భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వానికి తగిన సమయంలో రైతాంగం బుద్ధి చెప్పడం ఖాయమని రెడ్యం తీవ్రంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి పీతాంబరి మహేశ్వర్ రెడ్డి, వైయస్సార్ సిపి నేత రెడ్యం నాగేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.
Homeఆంధ్రప్రదేశ్రైతాంగానికి మేలు చేయని కూటమి ప్రభుత్వానికి రైతు పండుగ నిర్వహించే అర్హత లేదు.వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి...
రైతాంగానికి మేలు చేయని కూటమి ప్రభుత్వానికి రైతు పండుగ నిర్వహించే అర్హత లేదు.వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం,,ధ్వజం
0
3
RELATED ARTICLES
- Advertisment -



