📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవధూవరులను ఆశీర్వదించిన నీలం మధు ముదిరాజ్...

వధూవరులను ఆశీర్వదించిన నీలం మధు ముదిరాజ్…

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కందుల స్వర్ణ యశ్వంత్ ముదిరాజ్ ల వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందుల సరళ కుమార్ ముదిరాజ్ కుమారుడు కందుల యశ్వంత్ ముదిరాజ్ వివాహ వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే, ముదిరాజ్ ముద్దు బిడ్డ నీలం మధు ముదిరాజ్ ప్రత్యేకంగా పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిర్ర రాజు ముదిరాజ్, మహేష్, శరత్, కుమార్,తదితర ముదిరాజ్ నాయకులతో పాటు పలువురు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

వివాహ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

వేదికను సాంప్రదాయ పుష్పాలంకరణతో అందంగా తీర్చిదిద్దగా, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో వివాహ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.