వధూవరులను ఆశీర్వదించిన నీలం మధు ముదిరాజ్…

మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కందుల స్వర్ణ యశ్వంత్ ముదిరాజ్ ల వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందుల సరళ కుమార్ ముదిరాజ్ కుమారుడు కందుల యశ్వంత్ ముదిరాజ్ వివాహ వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే, ముదిరాజ్ ముద్దు బిడ్డ నీలం మధు ముదిరాజ్ ప్రత్యేకంగా పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు....