📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ.సిబ్బంది హాజరు,మెడికల్ స్టాక్‌రూమ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ.సిబ్బంది హాజరు,మెడికల్ స్టాక్‌రూమ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే13) కంచికచర్ల మండలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.ఈ సందర్భంగా ఆమె సిబ్బంది హాజరు పట్టి,మెడికల్ స్టాక్ రూమ్‌ను సమగ్రంగా పరిశీలించారు.అంతేకాకుండా,కేంద్రంలో చికిత్స తీసుకుంటున్న రోగులను నేరుగా మాట్లాడి సిబ్బంది పని తీరు,వైద్య సేవల నాణ్యత,ఔషధాల లభ్యత వంటి అంశాల గురించి వివరంగా తెలుసుకున్నారు.తనిఖీ సమయంలో వైద్యశాఖ అధికారులు మాట్లాడుతూ,కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని స్పష్టం చేశారు.రోగుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి,నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.ప్రజల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ తనిఖీలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని,ఔషధాల కొరత లేకుండా చూడాలని,సిబ్బంది సకాలంలో హాజరు కావాలని సూచనలు ఇచ్చారు.రోగుల నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చిన విషయాలను స్వాగతించగా,ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిద్దుకోవాలని ఆదేశించారు.ఈ ఆకస్మిక తనిఖీల ద్వారా ప్రభుత్వం గ్రామ స్థాయిలోని ఆరోగ్య కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోందని స్పష్టమవుతోంది. స్థానిక అధికారులు మరియు సిబ్బంది ఎమ్మెల్యే సూచనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు మరియు కూటమి నేతలు స్థానిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.