📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పదవ తరగతి టాపర్లకు జ్ఞాపికలు, నగదు బహుమతుల ప్రదానం చేసిన ఎమ్మెల్యే కాకర్ల.

పదవ తరగతి టాపర్లకు జ్ఞాపికలు, నగదు బహుమతుల ప్రదానం చేసిన ఎమ్మెల్యే కాకర్ల.

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) వింజమూరు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన 63 మంది మెరిట్ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకం.విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల కృషి అమోఘం కాకర్ల సురేష్.నారా లోకేష్ విద్యా సంస్కరణల ఫలితమే ఉత్తమ ఫలితాలు ఎమ్మెల్యే కాకర్ల.ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభపై ఎమ్మెల్యే ప్రశంసలు.వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయములో నిర్వహించిన “పదవ తరగతి ఉత్తమ ప్రతిభావంతుల అభినందన మరియు ప్రతిభ ప్రోత్సాహక కార్యక్రమం”ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ హాజరై, పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించి ప్రభుత్వ పాఠశాలలలో ప్రధమ స్థానాలు సాధించిన ప్రతిభావంతులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్,మాట్లాడుతూ,రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు,తీసుకొచ్చిన సంస్కరణలు,ఆధునిక విద్య విధానాలు మరియు విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాల ఫలితంగానే ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు అద్భుత విజయాలు సాధించారని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం పట్టుదల క్రమశిక్షణ,ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో ఉన్నత ఫలితాలను సాధించడం గర్వకారణమని అన్నారు.

అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నాయకుల సహకారంతో ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో విశేష ప్రతిభ కనబరిచిన నియోజకవర్గంలోని 63 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేయడం జరిగింది. విద్యార్థుల కృషిని గుర్తించి వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే  తెలిపారు.అలాగే ఉత్తమ ఫలితాల సాధనలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.విద్యార్థుల విజయాల వెనుక తల్లిదండ్రుల త్యాగం ఉపాధ్యాయుల అంకితభావం,సమాజ సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే,వారు భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారో అడిగి తెలుసుకొని ప్రతి విద్యార్థి తన కలలను సాకారం చేసుకునే దిశగా కృషి చేయాలని సూచించారు.పిల్లల ఆశయాలను అర్థం చేసుకొని,వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని తెలియజేశారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని,ప్రతిభ కలిగిన ప్రతి విద్యార్థికి తాము ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular