📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు

యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు

📰 Generate e-Paper Clip

*యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు*

*15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం… రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఎమ్మెల్యే బాలు నాయక్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తో కలిసి నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 457 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈసారి మొత్తం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన ధాన్యం కొనుగోళ్లు వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనంగా లారీలు వేగవంతమైన తరలింపు వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో రైతులు తెచ్చిన ధాన్యం కళ్లాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరితగతిన మిల్లులకు తరలించే చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉన్న లారీలకు అదనంగా 30 లారీలు పెంచడంతో ప్రస్తుతం 100 లారీ లతో రవాణా కొనసాగుతోందని చెప్పారు. 24 గంటల్లో ధాన్యం అన్‌లోడింగ్ పూర్తి అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రైతులకు రూ.487 కోట్ల చెల్లింపులు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు రూ.487 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అవసరమైన చోట అదనపు హమాలీలు, కొత్త కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

*మిల్లర్లు పూర్తిస్థాయిలో సహకరించాలి..*

దేవరకొండ డివిజన్ పరిధిలోని 12 రైస్ మిల్లులు ధాన్యం స్వీకరణలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్, ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, “రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వర్షానికి ధాన్యం తడిచినా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది” అని స్పష్టం చేశారు. డిండి ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న వరి కోతలు, డిండి ప్రాంతంలో ఇంకా వరి కోతలు కొనసాగుతున్నాయని, అక్కడి నుంచి వచ్చే ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఉన్న 70 లారీలు సరిపోకపోతే మరిన్ని వాహనాలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇంచార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్ఓ వెంకటేష్, మార్కెటింగ్ అధికారులు, తహసీల్దార్లు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular